మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు..

by Kodari Anjali |   (  Updated:2026-04-19 11:56:55  IST  )

ఇచ్చిన మాట ప్రకారం రూ. 6.53వేలకు సంబంధించిన పరికరాలు ఎమ్మెల్యే అందజేశారు.

మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు..
X

దిశ, ఉట్నూర్: పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సీఎల్పీ నేత నేటి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుమ్మరితాండా వాసులతో మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక వారి జీవనోపాధి కొరకై ఉపయోగపడే పరికరాలు అందిస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. ఆయన ఆదేశాల మేరకు 6 లక్షల 53 వేల రూపాయలతో మెషినరీ, మట్టితో కుండలు చేయు పరికరాల కోసం 2 లక్షల రూపాయల కొనుగోలు చేసిన మిషన్ లను గ్రామస్తులకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదివారం అందించారు. ఈ సందర్భంగా కుమ్మరితండా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. కుమ్మరి తాండాలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చామనీ, మీ ఉరికి 20 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు. ప్రభుత్వం పైన విష ప్రచారం చేసే బీఆర్ఎస్ నాయకులను 10 ఎండ్లలో ఏమి ఇచ్చారో ప్రజలు ప్రశ్నించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారులు, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story