చీకట్లోనే ' పది' పేపర్లు దిద్దేస్తున్నారు..!

by Kodari Anjali |

ఆదిలాబాద్ మూల్యాంకన కేంద్రంలో చీకట్లోనే పదవతి తరగతి విద్యార్థుల పేపర్లు దిద్దుతున్నారు.

చీకట్లోనే  పది పేపర్లు దిద్దేస్తున్నారు..!
X

దిశ, ఆదిలాబాద్: ఏడాది అంతా కష్టపడిన పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తే చివరకు.. వారి పేపర్లు మూల్యాంకనం చేసే కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు లేక ఎలాగోలా జవాబు పత్రాలను నిర్లక్ష్యంగా దిద్దేసే పరిస్థితి ఏర్పడుతోంది. దీని ప్రభావం ఖచ్చితంగా ప్రతిభ గల విద్యార్థులపై పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లాలో పదో తరగతి పరీక్ష స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో విద్యాశాఖ నిర్లక్ష్యం బయటపడింది. ఆదిలాబాద్ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన మూల్యాంకన కేంద్రంలో కనీస కరెంట్ లేక ఉపాధ్యాయులు తమ సెల్ ఫోన్ గుడ్డి వెలుతురుతోనే పేపర్లను దిద్దేస్తున్నారు. శనివారం ఆ కేంద్రంలో కరెంట్ పోవడంతో ఉపాధ్యాయులు నిబంధనలను ఉల్లంఘిస్తూ.. సెల్ఫోన్ టార్చ్ లైట్ వెలుతురులో మూల్యాంకనం చేస్తున్న దృశ్యాలు "దిశ" కెమెరాకు చిక్కాయి. మరో వైపు సెల్ ఫోన్ అనుమతి లేని చోట ఉపాధ్యాయులు ఇలా నింబంధనలు ఉల్లంఘించిన వ్యవహారంతో విద్యాశాఖ విమర్శలు ఎదుర్కొంటుంది.

Next Story