- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేసవిలో త్రాగు నీటి సమస్య రాకూడదు
ఈ వేసవి కాలంలో ప్రజలకు త్రాగు నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.

దిశ ప్రతినిధి నిర్మల్ : ఈ వేసవి కాలంలో ప్రజలకు త్రాగు నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరం లో జిల్లా కలెక్టర్, భవేశ్ మిశ్రా తాగునీటి అంశంపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో తాగునీటి కొరత రాకూడదని అన్నారు. సంబంధిత శాఖల అధికారులు అంతా గతంలో నీటి సమస్య ఏర్పడిన ప్రాంతాలను గుర్తించి, నీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. రోజువారీ నీటి సరఫరా లో ఆటంకాలు ఎదురైతే, సమస్యలు తీర్చేందుకు తగు ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అలాగే కడెం ప్రాజెక్టు అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రాజెక్టు గేట్ల మరమ్మత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వేసవికాలం పూర్తయ్యేలోపు గేట్లకు సంబంధించి ఏవైనా చిన్న చిన్న మరమ్మత్తులు ఉంటే పూర్తి చేయాలని తెలిపారు. ఇప్పటినుంచి గేట్ల మరమ్మత్తుల చర్యలు పూర్తిచేస్తే వర్షాకాలం ఎటువంటి ఇబ్బంది కలగదని తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, ఇరిగేషన్ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






