- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీలో భగ్గుమన్న వర్గ పోరు
దిశ, కన్నెపల్లి : మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయిలో ఇటీవల బీజేపీ మండల అధ్యక్షుడు మధుకర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ రాష్ట్ర

దిశ, కన్నెపల్లి : మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయిలో ఇటీవల బీజేపీ మండల అధ్యక్షుడు మధుకర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు మధుకర్ కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఈ సమయంలోనే బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. వర్గపోరు ఉన్నదని నిరూపితమైంది. పెద్దపల్లి మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేతను పెద్దపల్లి బీజేపీ నేత గోమాసే శ్రీనివాస్ ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. అరేయ్ అని మాట్లాడితే చెంప పగులుద్ది అని వెంకటేష్ నేత అనడంతో బట్టలూడదీసి కొడతా అని గోమాసే శ్రీనివాస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ఇద్దరినీ సంజాయించడంతో గొడవ సద్దుమణిగింది. ఓ వైపు బీజేపీ నేతను కోల్పోయి పరామర్శించేందుకు వచ్చిన నేతలే రాష్ట్ర అధ్యక్షుడి ముందు ఒకరిపై ఒకరు దూషించుకోవడం బీజేపీ నేతల్లో చర్చంశంగా మారింది. సోషల్ మీడియాలో మీరు నీల్వాయి కి వచ్చింది కొట్టుకోవడం కోసమేనా అంటూ ప్రతిపక్ష పార్టీలా నేతలు వీడియోను వైరల్ చేయడం గమనార్హం. వీడియో






