కనీస సౌకర్యాలు లేక భక్తుల ఇబ్బందులు..

by Sumithra |
కనీస సౌకర్యాలు లేక భక్తుల ఇబ్బందులు..
X

దిశ, మంచిర్యాల టౌన్ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంచిర్యాల పుష్కర ఘాట్ కి గోదావరి స్నానానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గోదవరి అంతా బురద మయం కావడంతో చాలామంది బురదలోనే నడుచుకుంటు వెళ్లి స్నానాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. శనివారం మహాశివరాత్రి కావడంతో ఒక రోజు ముందే వేలాది మంది భక్తులు గోదావరి స్నానాలు చేసేందుకు వచ్చారు.

వారికి ఎటువంటి సౌకర్యాలు ఇక్కడ కల్పించక పోవడంతో చాలా మంది భక్తులు వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఈ సారి ముల్కల్ల పుష్కర ఘాట్ మూసి వేయడంతో చుట్టూ పక్కల ప్రాంతాల ప్రజలు మంచిర్యాల పుష్కర ఘాట్ కే వచ్చారు. చాలా మంది భక్తులు బురదలో కాలు జారీపడి పోగా వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగ మారింది. మహిళలకు దుస్తులు మార్చుకునే గదులు గోదావరి ఒడ్డున ఉన్నప్పటకీ పాడైపోయి అపరిశుభ్రంగా ఉన్నాయి. దీంతో కనీసం దుస్తులు మార్చు కోడానికి తాత్కాలిక షెడ్లు అయిన ఏర్పాటు చేయలేదని మహిళ భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story