- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెజ్జూర్ లో చోరీ ఘటన.. డాగ్ స్క్వాడ్ బృందం రంగంలోకి..!
by Ratna Kumari |
దిశ, బెజ్జూర్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని ఏలేశ్వరం జ్యువెలర్స్ చోరీ ఘటనపై ఆదివారం సాయంత్రం కౌటాల సీఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో డాగ్

X
దిశ, బెజ్జూర్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని ఏలేశ్వరం జ్యువెలర్స్ చోరీ ఘటనపై ఆదివారం సాయంత్రం కౌటాల సీఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ బృందంతో పరిశీలన జరిపారు. ఏలేశ్వరం జ్యూవెలర్స్ లో కిలో వెండి చోరీకి గురైనట్టు యజమాని నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెజ్జూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ సమీపంలో గల ఏలేశ్వరం జ్యూవెలర్స్ చోరీ ఘటన పై క్షుణ్ణంగా పరిశీలించారు. దొంగల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని సీఐ సంతోష్ కుమార్ తెలిపారు ఆయన వెంట ఎస్సై సర్దాజ్ పాషా ఉన్నారు.
Next Story






