బంగారం మెరుగు పేరుతో చోరీ

by Ratna Kumari |

దిశ, ఆసిఫాబాద్ : బంగారం మెరుగు పేరుతో ఓ మహిళ నుంచి రూ. 3 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లిన సంఘటన కొమురం భీం ఆసిఫాబాద్

బంగారం మెరుగు పేరుతో చోరీ
X

దిశ, ఆసిఫాబాద్ : బంగారం మెరుగు పేరుతో ఓ మహిళ నుంచి రూ. 3 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లిన సంఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గోలేటిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోలేటి గారమంలోని భగత్ సింగ్ కాలనీకి చెందిన పెద్దల భీమక్క ఇంటికి గురువారం ఇద్దరు దుండగులు బంగారానికి మెరుగు పెడతామని వచ్చారు. ముందుగా ఇంట్లోని రాగి చెంబు మెరుగు పెట్టి ఇచ్చారు. తర్వాత ఆమెకు మాయమాటలు చెప్పి బంగారాన్ని సైతం మెరుపు పెడతామని..! ఉంటే ఇవ్వాలని నమ్మించి బంగారాన్ని ఓ గిన్నెలో వేడి నీళ్లు పోసి అందులో ఓ కెమికల్ వేశారు. బాధితురాలి ముందే బంగారు ఆభరణాలు గిన్నెలో వేసినట్లు చేసి.. 3 లక్షల విలువ చేసే బంగారంతో దుండగులు ఉడాయించారు. కాసేపటి తర్వాత భీమక్క గిన్నెలో బంగారు ఆభరణాలు చూడగా కనిపించలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. జిల్లా ఇతర దొంగతనం జరగడం ఇది రెండోసారి..గత సోమవారం కాగజ్ నగర్ పట్టణంలోని పెట్రోల్ బంక్ ఏరియా నివాసం ఉంటున్న సంధ్య శ్రీవాత్సవ్ ఇంట్లో సైతం ఇదే తరహాలో దుండగులు రెండున్నర తులాల బంగారాన్ని దొంగిలించారు.

Next Story