యువత స్వీయ గణనతో అధికారులకు సహకరించాలి : ఎమ్మెల్యే

by Batti.Sumithra |

గ్రామాల్లో చదువుకున్న యువత ప్రభుత్వం చేపడుతున్న జన గణనలో భాగంగా స్వీయ గణన చేసి అధికారులకు సహకరించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.

యువత స్వీయ గణనతో అధికారులకు సహకరించాలి : ఎమ్మెల్యే
X

దిశ, ఉట్నూర్ : గ్రామాల్లో చదువుకున్న యువత ప్రభుత్వం చేపడుతున్న జన గణనలో భాగంగా స్వీయ గణన చేసి అధికారులకు సహకరించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం ఉట్నూర్ మండలంలోని ఎమ్మెల్యే స్వగ్రామం కల్లూరుగూడాలో జనగణన సర్వే కార్యక్రమాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు. స్వయంగా ఎమ్మెల్యే ల్యాప్ టాప్ లో పూర్తి వివరాలు నమోదు చేసుకొని స్వీయ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లోని యువత మొబైల్ ఫోన్ లో స్వీయ గణన చేసుకొని వచ్చిన ఐడీ నెంబర్ అధికారులకు చెప్తే వారి పూర్తివివరాలు అధికారికంగా నమోదు అవుతాయని, స్వీయ గణన చేయడం చదువుకున్న యువతకి సులువని, యువత సహకారంతో సర్వే తక్కువ సమయంలో అధికారులు పూర్తి చేయగలగుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎమ్మార్వో రఘునాథ్, డీటీ అమృత్ లాల్, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story