- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తండ్రి బైకు కోనివ్వడం లేదని యువకుడు ఆత్మహత్య
దిశ, ఖానాపూర్ : తండ్రిని బైక్ కొనివ్వమని అడిగితే.. అందుకు తండ్రి నిరాకరించడంతో ఆ యువకుడు ఆత్మహత్య కు

దిశ, ఖానాపూర్ : తండ్రిని బైక్ కొనివ్వమని అడిగితే.. అందుకు తండ్రి నిరాకరించడంతో ఆ యువకుడు ఆత్మహత్య కు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బీర్నంది గ్రామపంచాయతీ కొమ్ముతాండకు చెందిన భూక్యా బలిరామ్ కుమారుడు భూక్య వెంకటేష్ (21) బుధవారం యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి బలిరామ్ ప్రతి రోజు బైకు కొనివ్వాలని అడిగేవాడని.. తండ్రి పంట వచ్చిన తరువాత కొనిస్తానని చెబుతూ వస్తుండగా.. తన బైక్ కోనివ్వడానికి కాలయాపన చేస్తున్నాడని ఆ యువకుడు క్షనికవేశంతో బుధవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు తెలిపిన పిర్యాదు మేరకు పోలీస్ విచారణ చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు.






