- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్వేను పకడ్బందీగా చేయాలి : అధికారి డాక్టర్ శిరీన్
దిశ, ఇంద్రవెల్లి : కుష్టు రోగులను గుర్తించేందుకు నిర్వహిస్తున్న సర్వేను ఆశా కార్యకర్తలు పకడ్బందీగా చేయాలని ఎయిడ్స్ అండ్ లెప్రసీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శిరీన్

దిశ, ఇంద్రవెల్లి : కుష్టు రోగులను గుర్తించేందుకు నిర్వహిస్తున్న సర్వేను ఆశా కార్యకర్తలు పకడ్బందీగా చేయాలని ఎయిడ్స్ అండ్ లెప్రసీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శిరీన్ అన్నారు. శుక్రవారం మండలంలోని ముత్నూర్, కేస్లాపూర్, పిట్ట బంగారం గ్రామాలలో ఆశాకార్యకర్తలు నిర్వహిస్తున్న సర్వేను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వేలో భాగంగా ప్రతి ఒక్కరికీ పరీక్షించాలని ఆశా కార్యకర్తలకు సూచించారు. మార్కింగ్ సైతం కనబడేటట్లు చేయాలని అన్నారు. ఎక్కువ సంఖ్యలో అనుమానితులను గుర్తించి సంబంధిత వైద్యాధికారుల వద్దకు పంపించాలని అన్నారు. కేస్లాపూర్, పిట్ట బొంగరం గ్రామాలలో గ్రామస్తులతో సమావేశమై కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ పారామెడికల్ అధికారులు వామన్ రావు, రమేష్, సూపర్వైజర్లు జలంధర్ సురేష్, ఆరోగ్య కార్యకర్తలు పద్మ, దేవిక, సంతోషి, ఆశా కార్యకర్తలు అనసూయ, సుమిత్ర పాల్గొన్నారు.






