అంగరంగ వైభవంగా శ్రీరాముని శోభాయాత్ర

by Naveena |

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని రాముని ఉత్సవ విగ్రహంతో చేపట్టిన శోభయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది.

అంగరంగ వైభవంగా శ్రీరాముని శోభాయాత్ర
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని రాముని ఉత్సవ విగ్రహంతో చేపట్టిన శోభయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. శోభయాత్ర ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాళ్ల బండి మహేందర్ ఆధ్వర్యంలో.. శ్రీ శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం వద్ద మఠం పీఠాధిపతి యోగానంద సరస్వతి స్వామి, ఆదిలాబాద్ ఎంపీ జి నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్, జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ లు ముఖ్య అతిథులుగా హాజరై శోభయాత్రను ప్రత్యేక పూజ చేసి ప్రారంభించారు. దీంతో భక్తులు ఉత్సవ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున జైశ్రీరామ్.. జై.. జై ..శ్రీరామ్ అంటూ చేసిన నామస్మరణ నినాదాలతో పట్టణంలోని పురవీధులు మారుమ్రోగి పోయాయి.

శోభాయాత్రను పురస్కరించుకొని ముందే కాషాయం జెండాలు పట్టణ పురవీధుల గుండా కట్టడంతో పట్టణమంతా కాషాయమయంగా మారిపోయింది. దీంతో శోభాయాత్రకు ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచి పట్టణ గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో.. శ్రీరాముని శోభాయాత్ర ముందుకు సాగుతోంది. అటు పోలీసులు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఈ ర్యాలీ ప్రతి శ్రీరామ నవమి నీ పురస్కరించుకొని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇది ఇందు బంధువుల ఐక్యతకు నిదర్శనం అని పేర్కొన్నారు. భవిష్యత్తులో హిందువులంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.

Next Story