- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెచ్చిపోతున్న హిజ్రాలు.. శుభకార్యం జరిగే ఇంటి యజమానికి ఆటోతో గుద్దడంతో రెండు కాళ్లకు గాయాలు
అమాయకపు ప్రజలను బెదిరిస్తూ.. ఇష్టమొచ్చినంత డబ్బులు అడుగుతూ, హిజ్రాలు రోజు రోజుకు మరింత రెచ్చిపోతున్నారు.

దిశ, లక్ష్మణచాంద: చింతలంచంద గ్రామంలో ఆదివారం రోజు లింగట్ల రాజన్న గృహప్రవేశం ఉందని తెలుసుకొన్న కొందరు హిజ్రాలు Instagram ID Nirmal pilla Deepu అనే గ్యాంగ్ 4, ఆటో డ్రైవర్‌తో కలిసి వచ్చి 11000 రుపాయలు డిమాండ్ చేశారు. వాళ్ళు మాకు తోచినంత 3000 రుపాయలు ఇస్తాం అన్న వినకుండా ఇంట్లో వాళ్ళందరిని బూతు మాటలు తిడుతూ.. బట్టలు పైకి లేపి ఆడవాళ్ళకి వాళ్ళ అంగాలను చూపిస్తూ మీరు నాశనం అవుతారు, మీ పిల్లలు కూడా నాశనం అవుతారు అంటూ తిట్టారు. డబ్బులు ఇచ్చిన ఎందుకు తిడుతున్నారు, ఇచ్చినవి తీస్కొని వెళ్ళండి అని చెప్పినా వినకుండా, ఆటో స్టార్ట్ చేసి ఇంటి యజమాని రాజన్నను రన్నింగ్‌లో ఉన్న ఆటోతో తోసి, కాళ్లపై నుండి ఆటో ఎక్కించి గాయపరిచారు. రాజన్నకు తీవ్ర రక్త స్రావం జరిగి రెండు కాళ్లు గాయపడ్డాయి. అలాగే వాళ్ళని వెంబడించినా, అడ్డం వచ్చినా, అడ్డుపెట్టిన ఆటోతోని గుద్దుకుని మరి వెళ్ళారు. అలాగే ఆపిన వాళ్ళని కూడా గుద్దుకుని వెళ్ళారు. వీళ్ళు ఎక్కడ కనిపించినా పైన తెలిపిన నెంబర్‌కి కాల్ చేయండి లేదా దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్‌కి ఫిర్యాదు చేయండి. లేదంటే వీళ్ళు అమాయక పేద కుటుంబాలును రోడ్డుకు లాగే స్థితికి తీసుకొస్తున్నారు. అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలాగే వీళ్ళు ఎక్కడ ఫంక్షన్‌లకి, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాజన్న బాధిత కుటుంబీకులు కోరుతున్నారు.






