- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాగోబా జాతర ఆదివాసీల ఆధ్యాత్మిక, సాంస్కృతిక గుర్తింపు ప్రత్యేకం
కేస్లాపూర్ నాగోబా మహాపూజలకు గంగాజలం తెచ్చేందుకు కాలినడకన బయలుదేరిన మెస్రం వంశస్తులను కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క కలిశారు.

దిశ, ఉట్నూర్ : ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా మహాపూజల సందర్భంగా గంగాజలం తెచ్చేందుకు కాలినడకన బయలుదేరిన మెస్రం వంశస్తులను కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం రాత్రి జైనూర్ మండలం దబోలి గ్రామంలో బస చేసిన మెస్రం వంశస్తుల పెద్దలతో ఆదివారం ఉదయం ప్రత్యేకంగా బేటీ అయిన సుగుణక్క, జాతర ఏర్పాట్లు, కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథ్‌తో కలిసి కలశం, పూజా సామగ్రికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ, కేస్లాపూర్ నాగోబా జాతర ఆదివాసీల ఆధ్యాత్మిక, సాంస్కృతిక గుర్తింపునకు ప్రతీక అని పేర్కొన్నారు.
గంగాజలంతో ఈ నెల 18న అర్ధరాత్రి నాగోబాకు అభిషేకం చేయనున్నట్లు గుర్తు చేస్తూ, ఈ పవిత్ర ఘట్టానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు, ముఖ్యంగా ఆదివాసీ గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న నాగోబా జాతరను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని, శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో పాల్గొని ఆదివాసీ సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలని సుగుణక్క కోరారు. నాగోబా దీవెనలతో జిల్లా ప్రజలందరికీ శుభం, శాంతి, సమృద్ధి కలగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఉయిక చందన్ షా, పెందోర్ అర్జున్, రాథోడ్ రాందాస్, తొడసం రాజేందర్, దుర్వ నాగేష్, మెస్రం నాగేష్, వెడ్మ జంగు బాయి, మండల అధ్యక్షుడు షేక్ ముఖీబ్, ఆత్మ చైర్మన్ రమేష్, నాయకులు మెస్రం అంబాజీ రావు, అజ్జు లాల్, రమేష్, గంగారాం, దత్తు, ఆదివాసీ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






