- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ: సొయం బాపురావు
ఈ నెల 28వ తేదీన భైంసాలో నిర్వహించే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ సభ ఏర్పాట్లను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంపీ సొయం బాపురావు శనివారం పరిశీలించారు.. Latest Telugu News

దిశ, భైంసా: ఈ నెల 28వ తేదీన భైంసాలో నిర్వహించే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ సభ ఏర్పాట్లను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంపీ సొయం బాపురావు శనివారం పరిశీలించారు. ఈ నెల 28న ప్రారంభం కానున్న ప్రజా సంగ్రామ యాత్రను అత్యంత కీలకంగా తీసుకుంటున్నట్లు ఎంపీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఎంపీ లతో పాటు పార్టీ కీలక నేతలు ఈ సభకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. యాత్రలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, హిందువులపై జరుగుతున్న దాడులపై ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. ఈ బహిరంగ సభకు సుమారు 70 వేల నుండి 80 వేల వరకు ప్రజలు హాజరుకానున్నట్లు తెలిపారు. ఎంపీ ప్రతి రోజు సుమారు 10 వేల మందితో పాదయాత్ర కొనసాగుతుందన్నారు. నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని బహిరంగ సభలో పాటు, ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రామదేవితో పాటు పలువురు బీజేపీ నేతలు ఎంపీ వెంట ఉన్నారు.






