- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అత్యాశతో దొంగగా మారిన పనిమనిషి..
పనిచేసే ఇంట్లోనే కూతురితో కలిసి దొంగతనం చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది.

దిశ, ఆదిలాబాద్: అత్యాశతో ఓ పనిమనిషి తన కూతురితో కలిసి దొంగతనానికి పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కాగా ఈ కేసులో మహిళను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ మేరకు మీడియాకు ఎస్పీ వివరాలు వెల్లడించారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలో నివసిస్తున్న ఉపాధ్యాయుడు పవర్ ప్రేమ్ సింగ్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును ఛేదించినట్లు జిల్లా ఎస్పీ వివరించారు. బాధితుడు గత నెల 16న శుభకార్యానికి వెళ్లి తిరిగి వచ్చిన ఆయన బంగారం, వెండిని ఇంట్లోనే భద్రపరిచారు. ఈ పరిస్థితిని గమనించిన పనిమనిషి దేవల లక్ష్మి, తన కూతురితో కలిసి ముందుగానే కుట్ర పన్ని, ఇంటి వెనుక గది తలుపును గడియ పెట్టకుండా ఉంచింది. ఇంటి యజమానులు లేని సమయాన్ని అదునుగా చేసుకుని 18న 10 తులాల బంగారం, వెండిని అపహరించారన్నారు.
దొంగిలించిన సొత్తును విక్రయించేందుకు..
దీంతో బాధితులకు వెంటనే అనుమానం రాకపోవడంతో ఘటన ఆలస్యంగా బయటపడిందని తెలిపారు. ఈనెల 26న మరో శుభకార్యానికి వెళ్లే సందర్భంలో నగలు కనిపించకపోవడంతో, బాధితులు 27న ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు అని తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించడం జరిగిందని పేర్కొన్నాడు. తల్లి అత్యాశతో కూతురితో కలిసి దొంగతనానికి పాల్పడిందని తెలిపారు. దొంగిలించిన సొత్తును విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బుధవారం ఇచ్చోడ పట్టణంలో వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. వారి వద్ద నుంచి దొంగలించిన మొత్తం సొత్తును తిరిగి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసును వేగంగా ఛేదించిన ఇచ్చోడ ఎస్‌హెచ్‌ఓ బండారి రాజు,ఎస్ఐ రమేష్,సిబ్బంది రుక్మారెడ్డిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.






