- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెమలిని చంపిన హంతకులు అరెస్ట్
దిశ, బోథ్ : జాతీయ పక్షి నెమలిని చంపిన ముగ్గురు హంతకులను అరెస్టు చేసినట్లు బోథ్ ఎఫ్ఆర్ఓ ప్రణయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ మాట్లాడుతూ అదిలాబాద్ జిల్లా గాదిగూడ

దిశ, బోథ్ : జాతీయ పక్షి నెమలిని చంపిన ముగ్గురు హంతకులను అరెస్టు చేసినట్లు బోథ్ ఎఫ్ఆర్ఓ ప్రణయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ మాట్లాడుతూ అదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని ఖాండు రాంపూర్ గ్రామానికి చెందిన బద్వాల్ గంగా సింగ్ బోథ్ మండలంలోని పొచ్చెర గ్రామంలో పాలేరుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గురువారం పొలం గట్టుపైన గడ్డి కోస్తుండగా నాలుగు నెమలి గుడ్లను గమనించాడు. నెమలి గుడ్ల వద్దకు వస్తుందని గ్రహించి నెమలిని చంపాలన్న పథకం పన్ని అదే గ్రామంలో గల వలస కూలీలు అయిన గాదిగూడా మండలంలోని లోకారి గ్రామానికి చెందిన పిప్రే దత్తు, ఇంద్రవెల్లి మండలంలోని గోపాల్ పూర్ గ్రామానికి చెందిన టార్పే బాలాజీ లు ముగ్గురు కలిసి పథకం ప్రకారం గురువారం రాత్రి గుడ్ల పై పొదిగి ఉన్న నెమలిని హతమార్చారు. గుడ్లను, చనిపోయిన నెమలిని ద్విచక్ర వాహనంపై తీసుకు వెళుతుండగా పెట్రోలింగ్ చేస్తున్న అటవీ శాఖ అధికారులకు అనుమానం వచ్చి వారిని తనిఖీ చేయగా చనిపోయిన నెమలి, గుడ్లు కనబడడంతో వాటిని స్వాధీనం చేసుకొని నిందితులపై వన్య ప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను శుక్రవారం రిమాండ్ కు తరలించినట్లు ఎఫ్ఆర్ఓ తెలిపారు.






