ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది..

by Disha Web Desk 20 |
ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది..
X

దిశ, మంచిర్యాల టౌన్ : తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని ఎన్నో కలలుకన్న యువతకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు కన్నా కలల్ని కాలరాసిందని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథ్ అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయం వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా శనివారం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. టీఎస్పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీకేజీ మంత్రి కేటీఆర్ అండదండలతో జరిగిందని, బీఆర్ఎస్ కార్యకర్తలకు ఈ ప్రశ్నపత్రాలు అందించి రాష్ట్రంలో ఉన్ననిరుద్యోగ జీవితాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం అడుతుందన్నారు. ఒక్కరూ పేపర్ లీక్ చేయడం వలన ప్రభుత్వంని తప్పుపట్టడం సరికాదని మాట్లాడిన మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని ఆయన తెలియజేశారు.

ఒక్క కేసీఆర్ వల్ల రాష్ట్రం మొత్తం నాశనం అయింది చాలదా, నిరుద్యోగ యువత తల్లిదండ్రులు కష్టపడి తమ పిల్లను చదివించి హైదరాబాద్ కి పంపి వేల రూపాయలతో కోచింగులు ఇప్పిస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడుతుందని అన్నారు. నిరుద్యోగ యువత ఎవరు కూడా అధైర్య పడవద్దని బీజేపీ అందరికీ అండగా ఉండి నిరుద్యోగుల తరఫున పోరాటం చేస్తుందని భరోసానిచ్చారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ తక్షణమే రాజీనామా చేయాలని, సిట్టింగ్ జడ్జితో ఈ కేసును విచారణ జరిపించాలని, పరీక్షలకు సిద్ధం అవుతున్న యువతకు 1 లక్ష రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తలు చేసిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది, పోలీస్ లు ఏర్పాటు చేసిన బారిఖేడ్ లను నెట్టుకొని వెళ్లే ప్రయత్నం చేశారు.

బీజేపీ కార్యకర్తలు వారిని పోలీస్ లు అడ్డుకునే ప్రయత్నం చేయగా బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య జరిగిన తోపులాటలో బీజేపీ కార్యకర్తలు పలువురికి గాయాలు కాగా బీజేవైఎం అధ్యక్షుడు పట్టివెంకట కృష్ణ చేతికి తీవ్రగాయం కాడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో పోనుగోటి రంగ రావు, పెద్దపల్లి పురుషోత్తం, అందుగుల శ్రీనివాస్, మునిమంద రమేష్, తుల ఆంజనేయులు, పట్టి వెంకట కృష్ణ, జొగుల శ్రీదేవి, మధవరపు రమణ రావు, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, అగల్ డ్యూటీ రాజు, అట్కపురం రమేష్, రాజ్ కుమార్, రెడ్డిమల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed