గంగాపూర్ పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవం

by Ratna Kumari |

దిశ, ఉట్నూర్ : ఉట్నూర్ మండల ప‌రిధిలోని గంగాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవంగా పంచాయతీ ప్రజలు ఆదివారం తీర్మాణించారు. ఏకగ్రీవ సర్పంచ్ గా పంచాయతీ పరిధిలో

గంగాపూర్ పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవం
X

దిశ, ఉట్నూర్ : ఉట్నూర్ మండల ప‌రిధిలోని గంగాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవంగా పంచాయతీ ప్రజలు ఆదివారం తీర్మాణించారు. ఏకగ్రీవ సర్పంచ్ గా పంచాయతీ పరిధిలో వంకతుమ్మ గ్రామానికి చెందిన మెస్రం శేఖర్ నారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పంచాయతీ ప్రజలు తీర్మానించారు. గంగాపూర్ పంచాయతీ సర్పంచ్ గా గత ఎన్నికల్లో గంగాపూర్ కి వరించగా పంచాయతీ పరిదిలో వంకతుమ్మ గ్రామానికి చెందిన గిరిజనుడికి ఇవ్వాలని ప్రజలు అందరూ తీర్మానించారు. ఏకగ్రీవ సర్పంచ్ గా ఎన్నికైన మెస్రం శేఖర్ నారాయణ కాంగ్రెస్ పారి పార్టీ కార్యకర్తగా, యువకుడిగా అందరి సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఉన్నందున ఆయనను ఎన్నికునట్టు మేధావులు, గ్రామ పెద్దలు, ప్రజలు పేర్కొన్నారు. జిల్లాలోనే మొదటి ఏకగ్రీవ పంచాయతీగా ఉట్నూర్ మండలంలోని గంగాపూర్ పంచాయతీ నిలిచింది. సర్పంచ్ గా ఎన్నికైన శేఖర్ నారాయణను పంచాయతీ ప్రజలు అభినందనలు తెలిపారు. పంచాయతీ పరిధిలోని అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారంలో తన వంతుగా కృషి చేస్తానని ఏకగ్రీవ సర్పంచ్ శేఖర్ నారాయణ పేర్కొన్నారు.

Next Story