- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూబ్లీహిల్స్ ఎన్నికలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
దిశ, ఆదిలాబాద్ : జూబ్లీహిల్స్ ఎన్నికలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని, అక్కడ రైతులు లేరు కాబట్టి నాయకులకు ఇక్కడి సమస్యలు తెలియట్లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

దిశ, ఆదిలాబాద్ : జూబ్లీహిల్స్ ఎన్నికలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని, అక్కడ రైతులు లేరు కాబట్టి నాయకులకు ఇక్కడి సమస్యలు తెలియట్లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదిలాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. జనం బాటలో మాకు చాలా సమస్యలు స్వాగతం పలుకుతున్నాయన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో ఏ రైతు సంతోషంగా లేడని, రైతును విస్మరిస్తే రాజ్యం బాగుండదు రైతుకు అన్యాయం చేయవద్దన్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తో మాట్లాడి పత్తి రైతుకు మేలు చేస్తానన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో చనాఖా- కొరటా, కుప్తి ప్రాజెక్ట్ లు పెండింగ్ లో ఉన్నాయని.. వాటిని తక్షణమే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ కొమురం భీం కాలనీలో ఆదివాసీలకు సమస్యలు ఉన్నాయని..ప్రభుత్వం వారిని పిలిచి మాట్లాడితే సమస్య తీరుతుందన్నారు. ఇక్కడ పేదవారికోసం ఏం చేయట్లేదు గానీ.. మావాలలో 181 ఎకరాల ప్రభుత్వ భూమిని పెద్ద వాళ్ల కోసం రిజిస్ట్రేషన్ చేశారన్నారు. అదేవిధంగా జైనథ్ ఆలయం గర్భగుడిలో నీళ్లు వస్తున్నాయని, ఇక్కడ ఉన్న ఎంపీ నగేష్ రూ.20 లక్షలు అందించి సమస్య పరిష్కరించాలన్నారు. ఆదిలాబాద్ లో ఐటీ టవర్ పూర్తయ్యాక...కంపెనీలు వచ్చేలా మంత్రి శ్రీధర్ బాబు కృషి చేయాలన్నారు. ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కోసం భూ సేకరణలో ప్రజల ఇళ్లు కోల్పోకుండా ప్రభుత్వం చూడాలన్నారు. ఆదిలాబాద్ టౌన్ లో రెండు అండర్ బ్రిడ్జ్ లు, ఒక ఓవర్ బ్రిడ్జి లు పూర్తి కాలేదన్నారు. మరోవైపు పటాన్ చెరు, ఆర్మూర్, ఆదిలాబాద్ రైల్వే లైన్ వచ్చేలా స్థానిక ఎంపీ కేంద్రంతో మాట్లాడాలన్నారు. ప్రైవేట్ కాలేజ్ ల బంద్ కు తాను మద్దతిస్తున్నానని కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడం సిగ్గుచేటన్నారు.






