- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు గొప్పవి..
ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవని.. వాటిని కాపాడుకోవాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు.

దిశ, ఆసిఫాబాద్: ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవని.. వాటిని కాపాడుకోవాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం కెరమెరి మండలంలోని జోడేఘాట్ గ్రామాన్ని జిల్లా ఎస్పీ నితిక పంత్. ఏఎస్పీ చిత్తరంజన్. డీఎస్సీలతో సందర్శించారు. భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మ్యుజియంని సందర్శించారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా 1000 మంది వాహనదారులకు హెల్మెట్ పంపిణీ చేశారు. పోలిస్ మీకోసం కార్యక్రమంలో భాగంగా 50 గిరిజన మహిళలకు కుట్టు మిషన్ల అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని.. పోలీస్ శాఖ ప్రజల భద్రతతో పాటు వారి సంక్షేమం కోసం కూడా కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ఆదివాసి మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు ఆదివాసి కళాకారులు సంప్రదాయ దింసా, గుస్సాడి నృత్యాలను ప్రదర్శించగా.. డీజీపీ వాటిని ఆసక్తిగా వీక్షించి కళాకారులతో కలిసి ఫోటోలు దిగారు.






