కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదు : బీజేపీ జిల్లా అధ్యక్షుడు

by Batti.Sumithra |

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్ణంపేట జాతీయ రహదారి పై రాస్తారోకో నిర్వహించి అనంతరం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కూటమి దిష్టిబొమ్మలను దహనం చేశారు.

కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదు : బీజేపీ జిల్లా అధ్యక్షుడు
X

దిశ, చెన్నూర్ : పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా బిల్లును అమలు చేయాలని కోరుతూ భీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో, బిల్లును తిరస్కరించిన కాంగ్రెస్ కూటమి నాయకులు తగిన మూల్యం చెల్లించక తప్పదని, మహిళల ఉసురు తగిలి నాశనమైపోతారని బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్ణంపేట జాతీయ రహదారి పై రాస్తారోకో నిర్వహించి అనంతరం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కూటమి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1996 నుంచి నేటి వరకు మహిళా బిల్లును అమలు కాకుండా స్వయంగా కుట్రలు చేస్తూ, ఇతర పార్టీ నాయకులను కూడా బిల్లును అడ్డగించామని ప్రోత్సహిస్తూ మహిళా బిల్లుకు ఆటంకాలు కలిగిస్తున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదని మరోసారి రుజువైందని తెలిపారు. 2013లో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో మహిళా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు, బహిరంగ మద్దతు ప్రకటించి రాజ్యసభలో బిల్లును ఆమోదింప చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుందని అన్నారు.

అయితే ఆ బిల్లు ఎలా ఆమోదం పొందుతుందోనని భయంతో పార్లమెంటులో కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకురాలేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మహిళల పట్ల ఉన్న అభిమానం కారణంగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం 2023లో మహిళా బిల్లును ప్రవేశపెట్టి విజయాన్ని సాధించిందని, 2029లో అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో కాంగ్రెస్ మరోసారి అడ్డగించి 50 శాతం మహిళల ఆశలపై నీళ్లు చల్లిందని అన్నారు. దీనికి కాంగ్రెస్ కూటమికి దేశంలోని మహిళలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు బుర్ర రాజశేఖర్, 17వ వార్డు కౌన్సిలర్ ఏతం శివకృష్ణ, సీనియర్ నాయకులు వెంకటేశ్వర్, రత్న లక్ష్మీనారాయణ రెడ్డి, మహిళా నాయకురాలు ఎడ్ల స్వరూపరాణి, ముత్యాల శ్రావణి, చెన్నూరు మండల పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకటేష్, మాణికరావు శంకర్, మండల నాయకులు కొఠారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story