- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే చెరువులకు మహర్దశ
కాంగ్రెస్ ప్రభుత్వం తోనే చెరువులకు మహర్దశ అని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు.

దిశ, మంచిర్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం తోనే చెరువులకు మహర్దశ అని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి మున్సిపాలిటీలోని జాతి కుంట చెరువు సుందరీకరణ పనులకు ఎమ్మెల్యే చేతులమీదుగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బెల్లంపల్లి పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తోందని అన్నారు. జాతి కుంట చెరువు సుందరీకరణ కొరకు ప్రభుత్వం రూ. 1.56 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. చెరువు సుందరీకరణ పనులు పూర్తయిన తర్వాత ఈ ప్రాంతం మరింత ఆహ్లాదకరమైన వాతావరణంలో సంతరించుకుంటుందని అన్నారు. చెరువు పరిసర ప్రాంతాలను పచ్చదనాన్ని పెంపొందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. త్వరలోనే చెరువు సుందరీకరణ పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బెల్లంపల్లి పట్టణ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడం కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్నారు. బెల్లంపల్లి పట్టణం తో పాటు నియోజకవర్గంలోని మండలాల అభివృద్ధి పతంలో ముందుకు తీసుకు వెళ్లేందుకు నిరంతర కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, మున్సిపల్ చైర్మన్ దావ.స్వాతి రమేష్, కౌన్సిలర్లు కంకటి. ప్రణీత, కాంపెల్లి. రాజం, అధికారులు తదితరులు పాల్గొన్నారు.






