- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు.

దిశ, మంచిర్యాల : ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజలను నయవంచనకు గురిచేసిందన్నారు. ఇల్లు లేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిందన్నారు. కమీషన్ల కోసమే ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ నాయకులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
ఈ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఒక్క వృద్ధాప్య పింఛన్, వితంతు పింఛను నూతనంగా మంజూరు చేసింది లేదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తానని ఉద్దేశం తోనే రైతుబంధు ఇస్తానని ప్రకటించడం రైతులను దగా చేయడం కోసమే అని ఎద్దేవా చేశారు. మంచిర్యాల మార్కెట్ రోడ్ లో రోడ్డు విస్తరణలో భాగంగా అభివృద్ధి పేరుతో ఇఫ్తారీతిన ఇళ్లను షాపులను కూల్చివేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేశారని ఉద్దేశంతో ఇవాళ కక్షపూరితంగా కూల్చివేతలు చేస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది అధికారులు కూడా కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారని దుయ్యబట్టారు.
రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, సుస్థిరమైన పాలన అందించి అవినీతి అధికారులపై చర్యలు తీసుకునే విధంగా పరిపాలన ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే ఆమురాజుల.శ్రీదేవి, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల. మల్లేష్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల. హేమాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం.అశోక్, వెంకటేశ్వరరావు, కృష్ణమూర్తి, పట్టి.వెంకటకృష్ణ, కోడి. రమేష్, కమలాకర్ రావు, జోగుల. శ్రీదేవి, ముత్య.సత్తయ్య, జిల్లా కార్యదర్శులు వైద్య.శ్రీధర్, రాచర్ల.సంతోష్, మహేందర్ గౌడ్, మంత్రి సురేఖ, రామయ్య, ఠాగూర్, శైలేందర్, ఉదయశ్రీ, మండల అధ్యక్షులు అమీర్ శెట్టి. రాజకుమార్, చక్రవర్తి, శ్రీశైలం, రమేష్ పాల్గొన్నారు.






