- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిఎంఆర్ డెలివరీ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి
సిఎంఆర్ ( కస్టమ్ మిల్లింగ్ రైస్) డెలివరీ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.

దిశ ప్రతినిధి నిర్మల్ : సిఎంఆర్ ( కస్టమ్ మిల్లింగ్ రైస్) డెలివరీ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం సిఎంఆర్ డెలివరీ ప్రక్రియ పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,..మిల్లులకు కేటాయించిన సిఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలని అన్నారు. సిఎంఆర్ కు సంబంధించిన వివరాలను మిల్లర్ల వారిగా సమీక్షించారు. సిఎంఆర్ డెలివరీలో వెనుకబడిన మిల్లర్లు, ప్రక్రియలో వేగం పెంచాలని ఆదేశించారు. అన్ని మిల్లులలో, మిల్లులకు సంబంధించిన అన్ని రకాల రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. రికార్డుల నిర్వహణకు సంబంధించి అధికారులు, మిల్లర్లకు అవగాహన కల్పించాలని వివరించారు. సీఎంఆర్ ప్రక్రియలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. వరి ధాన్యపు సంచులు ఉంచడానికి తగిన గోదాములు ఇతరత్రా ప్రదేశాలు అన్వేషించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే లారీల ద్వారా ధాన్యపు సంచులను తరలించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ధాన్యపు సంచులు కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉండకూడదన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, పౌరసరఫరాల అధికారి రాజేందర్, మేనేజర్ సుధాకర్, రైస్ మిల్లర్లు, అధికారులు, పాల్గొన్నారు.






