బైకు ట్రాక్ట‌ర్ ఢీ.. ఒక‌రికీ తీవ్ర గాయాలు

by Ratna Kumari |

దిశ, కాగజ్‌నగర్ : కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్ మండలం గన్నారం–ఆరెగూడ సమీపంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బైక్, ట్రాక్టర్‌ను ఢీకొనడంతో

బైకు ట్రాక్ట‌ర్ ఢీ.. ఒక‌రికీ తీవ్ర గాయాలు
X

దిశ, కాగజ్‌నగర్ : కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్ మండలం గన్నారం–ఆరెగూడ సమీపంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బైక్, ట్రాక్టర్‌ను ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తలకు తీవ్ర గాయాల‌య్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఈగాం ఎస్సై కళ్యాణ్ తెలియజేశారు. కాగజ్‌నగర్ మండలం గన్నారం–ఆరెగూడ మధ్య బైక్‌పై ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిని ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగజ్‌నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ, బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో, మెరుగైన వైద్యం నిమిత్తం అతడిని వెంటనే మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది అని తెలిపారు.

Next Story