- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందాలి : కలెక్టర్ కె.హరిత
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం సిర్పూర్-టి మండలం మేడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు నరసింహ, ఈఈ ధర్మేంద్రలతో కలిసి ఆమె పాల్గొన్నారు.

దిశ, ఆసిఫాబాద్ : ప్రజాపాలనతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం సిర్పూర్-టి మండలం మేడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు నరసింహ, ఈఈ ధర్మేంద్రలతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని అధికారుల ద్వారా చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పెండింగ్‌లో ఉన్న సమస్యల సత్వర పరిష్కారం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని సూచించారు. వ్యవసాయ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, ఉపాధి హామీ పనులు, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాల పై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు, రైతులకు రూ.2 లక్షల లోపు రుణమాఫీ, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు వంటి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని ఆమె పేర్కొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ నమోదైన కేసుల వివరాలు, బాధిత మహిళలకు అందిస్తున్న సేవల పై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సఖి కేంద్రానికి వచ్చే బాధిత మహిళల పట్ల సమయానుకూలంగా స్పందించి వారికి న్యాయం చేయాలని సూచించారు. దీని పై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి, ప్రతి కేసును సున్నితంగా పరిష్కరించడంతో పాటు బాధిత మహిళల గోప్యతను కాపాడుతూ బాధ్యతాయుతంగా పని చేయాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు.






