- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, భైంసాః భైంసా మండల వ్యాప్తంగా రోజురోజుకూ పేకాట రాయుళ్లు మితిమీరిపోతున్నారు. మొన్నటికి మొన్న మండలంలోని మహాగం గ్రామంలో పేకాట రాయలు పట్టుబడగా, తాజాగా శనివారం మధ్యానం బైoసా పట్టణంలో కొందరు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. చోటామోటా నాయకులు సైతం ఈ పేకాటలో తమ జోరుచూపిస్తున్నారు. శనివారం బైంసా పట్టణంలోని ఎస్ ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ ఎదుట గల ఓ బంగ్లా వెనకభాగంలో పేకాట ఆడుతూ 10 మంది పట్టుబడ్డగా, ఇద్దరు పరారయ్యారు. బైంసా పట్టణ ఏఎస్పీ అవినాష్ కుమార్, పట్టణ ఎస్ఐలు షరీఫ్, గౌస్ పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగి పేకాట ఆడుతున్న పేకాటరాయుళ్ళను పట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తమ వద్ద ఉన్న దాదాపు రూ.57 వేల రూపాయలను,12 మొబైల్స్ ,3 ద్విచక్ర వాహనాలు, ఒక కారు నీ పోలీసులు స్వాధీనపరుచుకున్నారు.
Next Story






