- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాసర ఆలయ పునర్నిర్మాణకి 225 కోట్లు కేటాయించడం హర్షనీయం...
బాసర ఆలయ పునర్నిర్మాణం మాస్టర్ ప్లాన్ కు ప్రభుత్వం 225 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు జీవో విడుదల చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనతేనని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు.

దిశ, బైంసా : బాసర ఆలయ పునర్నిర్మాణం మాస్టర్ ప్లాన్ కు ప్రభుత్వం 225 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు జీవో విడుదల చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనతేనని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. ఆదివారం తన నివాసంలో ప్రభుత్వం జీవో విడుదలచేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడారు గత పది సంవత్సరాల కాలంలో అమ్మవారి ఆలయం శిథిలావస్థకు చేరినప్పటికీ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం, పాలకులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర విషయంలో రెండుసార్లు అధికారులతో సమీక్ష నిర్వహించడం, ఒకేసారి 225 కోట్లు నిధుల విడుదల చేయడం పట్ల ఆయనకు నియోజకవర్గ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు చెప్పారు.
దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధిగాంచిన అమ్మవారి పుణ్యక్షేత్రం అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి దృష్టి సారించడాన్ని ప్రజలు చిరస్థాయిగా గుర్తించుకుంటారన్నారు. 225 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం, రాజ గోపురాల నిర్మాణం, కోనేరు ఆధునికరణ, రోడ్ల విస్తరణ ఇలా ఎన్నో అభివృద్ధి పనులు పూర్తవుతాయన్నారు. ఆలయ మాస్టర్ ప్లాన్ కు 327 కోట్ల నిధులు ఖర్చవుతాయని తనికెళ్ల ఇంటిగ్రేటెడ్ కన్సల్టెన్సీ కంపెనీ అంచనాలు తయారు చేసిందన్నారు.అమ్మవారి క్షేత్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనకు రావడం, తన మనవడికి అక్షరాజ్యాసం ఇక్కడే చేయించడం ఆనందంగా ఉందన్నారు. గత పాలకులకు కనువిప్పు కలిగేలా ముఖ్యమంత్రి చర్యలు చేపట్టడం శుభ పరిణామం అన్నారు. కార్యక్రమానికి పెద్ద మొత్తంలో భక్తులు తరలి రావాల్సిందిగా కోరారు.ఎమ్మెల్యే వెంట బీజేపీ నాయకులు వున్నారు.






