పట్టా ఉంటే పైసలే..!

by Nallavelli.Anjaneyulu |

ఆరుగాలం శ్రమించి,పంట పండించే రైతులు దుక్కి దున్నడం,విత్తనాలు నాటడం,మందులు చల్లడం,కలుపు తీయించడం,

పట్టా ఉంటే పైసలే..!
X

దిశ, బైంసా : ఆరుగాలం శ్రమించి,పంట పండించే రైతులు దుక్కి దున్నడం,విత్తనాలు నాటడం,మందులు చల్లడం,కలుపు తీయించడం, పత్తి ఎరడం, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇలా అన్నీ భరిస్తున్న రైతులు లాభపడుతున్నారో..! లేదో కానీ, దళారులు మాత్రం బాగానే లాభపడుతున్నారు. సీసీఐ పత్తి కొనుగోలు ప్రారంభమైన నుండి మార్కెట్లో పత్తి పంట నమోదు చేసుకున్న పలువురి రైతుల పట్టాలను ఒక దగ్గర చేర్చి,కొందరు వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇలా పత్తి రాయించుకున్న పట్టా పాస్ బుక్కు రైతుకి సదరు వ్యాపారి క్వింటాల్కి దాదాపు 400 నుండి 500 రూపాయలు చెల్లిస్తున్నారు. ఇలా ఇచ్చిన పాస్ బుక్ లపై పత్తిని కొనుగోలు చేసి వ్యాపారం కొనసాగిస్తున్నారు. అయితే సదరు పత్తి అమ్మిన రైతుకి సీసీఐ కొనుగోలు రేటు కన్నా దాదాపు 800 రూపాయల నుండి 1000 రూపాలు తక్కువగా నెట్ పేమెంట్ కింద ఇచ్చి, డబ్బులు ఇచ్చే వ్యాపారి పట్టా ఇచ్చే సదరు వ్యక్తి వీటిని చేరోసగం పంచుకొని జోరుగా దందాలు కొనసాగిస్తున్నారు.

మహారాష్ట్ర పత్తి కి సైతం ఇదే తంతు

సరిహద్దు ప్రాంతాలైనటువంటి మహారాష్ట్ర నుండి వచ్చే పత్తికి ఇక్కడి పాసుబుక్కులు లేకపోవడంతో ఇక్కడి పాస్బుక్కులు గల రైతులకు కొంచెం డబ్బును అప్పజెప్పి అట్టి మహారాష్ట్ర పత్తిని సైతం వ్యాపారులు జోకుతున్నారు. పాసుబుక్కులు ఇచ్చిన వారికి క్వింటాల్ కి కొంత చొప్పున అమౌంట్ ఇచ్చి,కొందరు దర్జాగా వ్యాపారo కొనసాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

పట్టా ఉండి పంట పండించని వారికీ డిమాండ్

వ్యవసాయ భూములు కలిగి ఉండి కౌలుకిచ్చే పలువురు పట్టా పాస్బుక్ కలిగినటువంటి వ్యక్తులకి డిమాండ్ నెలకొని వుంది.పంట పండిచని రైతు కౌలుకిచ్చే క్రమంలో, కౌలు తీసుకున్న రైతువద్ద డబ్బులు రాగా.. మళ్ళీ పంటకొనుగోళ్ళ క్రమంలో ఇలాంటి వారి పట్టలకోసం దళారులు ఎగబడుతున్నారు. పంట పండించని సదరు భూమి కలిగిన వ్యక్తి పంటలు నమోదు చేసే కార్యక్రమంలో పట్టా పాస్ బుక్ పై పంట నమోదు చేయాగ, ప్రస్తుతం దళారులు ఇటువంటి పంట పండించని రైతులు పట్టాలకి క్వింటాలుకు డబ్బులు ఇస్తూ... పత్తి కొనుగోలు జరుపుతున్నారు.

Next Story