- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్నగుడిపేటలో ఆందోళన..
యాభై ఏండ్ల గా ఇక్కడే బతుకుతున్నాం.. ఇంటికి వెళ్ళే దారి మూసేస్తే ఎక్కడికి పోవాలి మా కుటుంబాలు ఎలా బతికేది అంటూ చిన్న గుడిపేట గ్రామానికి చెందిన బాధితులు శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు.

దిశ, మంచిర్యాల: యాభై ఏండ్ల గా ఇక్కడే బతుకుతున్నాం.. ఇంటికి వెళ్ళే దారి మూసేస్తే ఎక్కడికి పోవాలి మా కుటుంబాలు ఎలా బతికేది అంటూ చిన్న గుడిపేట గ్రామానికి చెందిన బాధితులు శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. పంచాయతీ పెట్టి సమస్య పరిష్కరిస్తానని చెప్పిన సర్పంచ్ పంచాయతీ ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లి ఫోన్ లేపడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న ఊరిలో ఉన్న ఇండ్లలోనే తమ కుటుంబాలను బందీలను చేశారంటూ గోడు వెళ్లబోసుకున్నారు. శుక్రవారం సాయంత్రం భీమిని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ దయనీయ స్థితిపై వేడుకుంటున్న తీరు పలువురుని ఆశ్చర్యానికి గురిచేసింది. గ్రామంలోని సర్వే నంబర్ 294లో ఉన్న 12 గుంటల భూమిని 50 ఏళ్ల క్రితమే అన్న కొమురయ్య అనే వ్యక్తి దగ్గర భూమిని కొనుగోలు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన పైసలతో ముత్తాతల కాలంలో భూమిని కొని, ఇండ్లు కట్టుకొని నివసిస్తున్నామని అన్నారు. రెండు మూడు తరాలుగా అక్కడే నివాసం ఉంటున్నామని కన్నీరుమున్నీరయ్యారు. గ్రామానికి చెందిన అన్న భీమయ్య అనే వ్యక్తి తమను కక్షపూరితంగా ఇళ్లలోకి వెళ్లకుండా చుట్టూ రహదారికి ఆనుకుని ఫెన్సింగ్ వేసి పూర్తిగా మూసి వేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చిన్న పిల్లలు, వృద్ధులు ఇళ్లలో నుంచి బయటికి రానీ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. న్యాయం చేయాలని స్థానిక సర్పంచ్ పెసరి.లింగమూర్తి దృష్టికి సమస్య విన్నవించినట్లు తెలిపారు. గ్రామంలోనే సమస్య సెటిల్ మెంట్ చేద్దామని చెప్పినట్లు వాపోయారు. నాడే డబ్బులు పెట్టి కొన్న భూమికి ఇప్పుడు మళ్లీ పైసలు ఎక్కడి నుంచి తేవాలని పేదలు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక కుమిలి పోయారు. స్థానికంగా ఎవరూ పట్టించుకోకపోవడంతో, బాధితులు అత్యంత దీనస్థితిలో తిండి లేకుండా పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగినట్లు తెలిపారు. ఇప్పుడు దారి లేక మా బతుకులు రోడ్డున పడ్డాయి. సర్పంచ్ కూడా మమ్మల్ని పట్టించుకోవడంలేదని మీరే మాకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు.






