- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాలి బూడిదైన పంట.. రైతన్నకు మిగిల్చిన కన్నీళ్లు!
by Jakkula.Mamatha |
కుబీర్ మండల కేంద్రంలోని పుప్పాల దత్తాత్రి మొక్కజొన్న పంట చేను ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రమాదంతో గురువారం దగ్ధమైంది.

X
దిశ, కుబీర్: కుబీర్ మండల కేంద్రంలోని పుప్పాల దత్తాత్రి మొక్కజొన్న పంట చేను ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రమాదంతో గురువారం దగ్ధమైంది. చేతికి వచ్చిన పంట కాలిపోవడంతో రైతన్నకు కన్నీళ్లు మిగిల్చింది. వానాకాలంలో సాగు చేసిన పంట అతివృష్టితో నష్టాలను మిగిల్చింది. గంపెడు ఆశలతో రబీలో తనకున్న 3 ఎకరాల్లో సాగు చేసిన పంట బూడిదయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రెవెన్యూ సిబ్బంది పంచనామా నిర్వహించి.. రూ.2.40లక్షల నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా వేశారు. కష్టం మాట దేవుడెరుగు, పెట్టుబడులన్నీ అప్పులను మిగిల్చిందని వాపోతున్నాడు. సంబంధిత శాఖతో నష్టపరిహారం ఇప్పించాలని రైతు వేడుకుంటున్నాడు. రోజుల వ్యవధిలోనే మండలంలో ఇది ఐదో మొక్కజొన్న పంట చేను దగ్ధం కావడం.
Next Story






