- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధ్యాయులను నియమించాలి
by Sridhar Babu |
పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ గురువారం జిల్లా కేంద్రంలో ఆదర్శ పాఠశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు.

X
దిశ, ఆసిఫాబాద్ : పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ గురువారం జిల్లా కేంద్రంలో ఆదర్శ పాఠశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఇటీవల పాఠశాలలోని 17 మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లారు. వారి స్థానంలో కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే రావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. బోధన చేసే టీచర్లు లేక తరగతి గదుల్లో ఖాళీగా కూర్చుంటున్నామని, దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. అంతకుముందు పాఠశాల నుంచి భారీ ర్యాలీగా వెళ్లి రోడ్డు పై బైఠాయించి రెండు గంటల పాటు ధర్నా చేపట్టారు.
- Tags
- Students strike
Next Story






