- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ
by Batti.Sumithra |
జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చిన రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది.

X
దిశ , ఆదిలాబాద్ : జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చిన రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. జైనథ్ మండలంలోని దీపాయి గూడ గ్రామంలో ఎమ్మెల్యే జోగు రామన్నను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి లు పరామర్శించి తిరుగు పయనమయ్యారు.
జిల్లా కేంద్రంలోని పంజాబ్ చౌక్ వద్ద 317 జీవో రద్దు చేయాలంటూ ఉపాధ్యాయులు రోడ్డు పైకి వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి 13 జిల్లాల్లో స్థానికత ఆధారంగా భర్తీ చేయకుండా 317 జీవో ప్రకారం భర్తీ చేశారని ఆరోపించారు. దీనివల్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వందల మంది ఉపాధ్యాయుల నష్టపోయారని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం 317 జీవోను రద్దు చేసి సీనియార్టీ ప్రకారం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
Next Story






