- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆన్ లైన్ లో మట్కా ముఠా పై టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం..!
దిశ, కాగజ్ నగర్ : కొమరం భీమ్ జిల్లాలో ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్న అక్రమ జూదం (మాట్కా) కార్యకలాపాలపై జిల్లా పోలీసులు తమ ఉక్కుపాదం మోపారు. జిల్లా పోలీస్ టాస్క్‌ఫోర్స్ బృందం బుధవారం

దిశ, కాగజ్ నగర్ : కొమరం భీమ్ జిల్లాలో ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్న అక్రమ జూదం (మాట్కా) కార్యకలాపాలపై జిల్లా పోలీసులు తమ ఉక్కుపాదం మోపారు. జిల్లా పోలీస్ టాస్క్‌ఫోర్స్ బృందం బుధవారం నిర్వహించిన మెరుపు దాడిలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ టాస్క్‌ఫోర్స్ బృందంకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆసిఫాబాద్ మండలంలోని జెండగూడ, ఎల్లారం గ్రామాలలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. దుర్గం సుమంత్ అనే వ్యక్తి జెండగూడ గ్రామవాసి అక్రమంగా ఆన్‌లైన్ మాట్కా ఆట ఆడటం లో ఒక మొబైల్ ఫోన్ మరియు ఒక కేనన్ ప్రింటర్. అరెస్టయిన వ్యక్తి నుండి స్వాధీనం చేసుకున్నరు సామాగ్రిని తదుపరి చర్యల నిమిత్తం ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్ హెచ్చరిక ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తీవ్రంగా స్పందించారు. అక్రమ ఆన్‌లైన్ జూదాలను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్న అక్రమ జూదాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. ఇలాంటి చర్యలు యువతను తప్పుదోవ పట్టిస్తాయని ఎస్పీ హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాలలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పాటిల్ గట్టిగా హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాల గురించి ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన ప్రజలను కోరారు. ఈ విజయవంతమైన ఆపరేషన్‌లో టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాణప్రతాప్ పర్యవేక్షణలో సిబ్బంది రాజు కంధూరి, మహ్మూద్, విజయ్, దేవేందర్, సంజీవ్, రమేశ్, శేఖర్ పాల్గొన్నారు.






