- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ దాడి.. ఆరుగురు అరెస్ట్
దిశ, కాగజ్ నగర్ : కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలంలో టాస్క్ ఫోర్స్ బృందం పేకాట స్థావరం పై మెరుపుదాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై

దిశ, కాగజ్ నగర్ : కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలంలో టాస్క్ ఫోర్స్ బృందం పేకాట స్థావరం పై మెరుపుదాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ హెచ్చరించారు. ఆదివారం వేళల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు కాగజ్‌నగర్ రూరల్ పరిధిలోని బోరిగావ్ గ్రామ శివారులో రహస్యంగా పేకాట ఆడుతున్న వ్యక్తులను గుర్తించారు. వెంటనే దాడి చేసి, పేకాట ఆడుతున్న మోర్లే అరవింద్, అతిక్, కార్తిక్, అష్రోజ్, జునైదుల్లా ఖాన్, చరణ్ ఈ ఆరుగురు వ్యక్తులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అరెస్ట్ అయిన వారి వద్ద నుంచి పోలీసులు ₹2,890 నగదు, 52 ప్లేయింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులను తదుపరి విచారణ నిమిత్తం కాగజ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ దాడిలో జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం తరఫున ఎస్సై రాజు కందూరి, హెడ్ కానిస్టేబుల్ మహమూద్, పోలీస్ కానిస్టేబుల్స్ విజయ్, రమేష్, హోంగార్డ్ శేఖర్ పాల్గొన్నారు.






