టాస్క్‌ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు.. బియ్యం మాఫియా గుట్టురట్టు

by Jakkula.Mamatha |

ప్రభుత్వం పేదవాడి ఆకలి తీర్చాలని పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది.

టాస్క్‌ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు..  బియ్యం మాఫియా గుట్టురట్టు
X

దిశ, కాగజ్ నగర్: ప్రభుత్వం పేదవాడి ఆకలి తీర్చాలని పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపమో లేక రాజకీయ అండదండలో కానీ కాగజ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో బియ్యం మాఫియా బరితెగించి ప్రవహిస్తోంది. తాజాగా వేంపల్లిలోని దుర్గా భవాని రైస్ మిల్‌పై జరిగిన దాడి ఈ అక్రమ దందాను మరోసారి బహిర్గతం చేసింది. బుధవారం రాత్రి సిర్పూర్ ఎస్ఐ సాగర్ మరియు టాస్క్ ఫోర్స్ అధికారులు నమ్మదగిన సమాచారంతో దుర్గా భవాని రైస్ మిల్‌పై విరుచుకుపడ్డారు. ఈ తనిఖీల్లో సుమారు 9 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, పోలీసులు వస్తున్నారనే సమాచారం ముందే పాకిందో ఏమో కానీ మిల్‌ ఆవరణలో లోడుతో సిద్ధంగా ఉన్న ఒక డీసీఎం వాహనం క్షణాల్లో అక్కడి నుంచి మయం చేశారు.

పోలీసుల కళ్లు గప్పి ఆ వాహనం వెళ్ళిపోయింది అంటే ఆ వాహనం వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తి ఎవరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా గజ్జల అనే పేరు మారుమోగిపోతోంది. ఈ అక్రమ బియ్యం రవాణాలో ఈ గజ్జల పాత్ర ఏంటి పట్టుబడ్డ బియ్యం నేరుగా ప్రభుత్వ గోనె సంచుల్లోనే ఉండటాన్ని బట్టి చూస్తే, ఇది కేవలం డీలర్ల దగ్గరి నుండి సేకరించింది మాత్రమే కాదని ఎం ఎల్ ఎస్ పాయింట్ల (మండల నిల్వ కేంద్రాల) లేదా రేషన్ డీలర్ల నుండే నేరుగా మిల్లుకు చేరుతోందని స్పష్టమవుతోంది. గత కొద్దిరోజుల క్రితమే జిల్లా కలెక్టర్ కే. హరిత రైస్ మిల్లర్ల యాజమాన్య తో సమావేశం నిర్వహించి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అప్పుడు గొర్రెల్లా తలలు ఊపిన కొందరు మిల్లర్లు బయటకు రాగానే తమ వక్రబుద్ధిని చాటుకుంటున్నారు.

మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ అవుతున్న తరుణంలో ఇదే అదనుగా భావించిన దుర్గా భవాని రైస్ మిల్లర్ యాజమాన్యం గజ్జలు మ్రోగేలా భారీ స్కామ్‌కు తెరలేపింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ పేదల బియ్యాన్ని రీ-సైక్లింగ్ చేసి సొమ్ము చేసుకునే ఈ దందా వెనుక ఎంత పెద్ద అండ ఉందో విచారణలో తేలాల్సి ఉంది. ప్రభుత్వ గోనె సంచులతో బియ్యం మిల్లుకు చేరుతున్నాయంటే, సివిల్ సప్లై అధికారులు ఏం చేస్తున్నారు ఈ గజ్జల వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు అధికారులు కేవలం సిర్పూర్ స్టేషన్‌లో నిల్వ ఉన్న ఆ 9 క్వింటాళ్ల బియ్యం కేవలం ఆరంభం మాత్రమే ఈ గజ్జల దందా మూలాలను తవ్వితే పెద్ద పెద్ద తిమింగలాలే బయటపడటం ఖాయం అని ప్రజలు అంటున్నారు.

Next Story