- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పూల తోటగా మారిన తలమడుగు సెలయేరు
దిశ, తలమడుగు : ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందభరితంగా బతుకమ్మ వేడుకలను మహిళలందరూ నిష్టతో ప్రతిరోజూ ఆటపాటలతో సంతోషంగా పది రోజుల పాటు బతుకమ్మ పండుగ

దిశ, తలమడుగు : ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందభరితంగా బతుకమ్మ వేడుకలను మహిళలందరూ నిష్టతో ప్రతిరోజూ ఆటపాటలతో సంతోషంగా పది రోజుల పాటు బతుకమ్మ పండుగ జరుపుకున్నారు. తలమడుగు మండల కేంద్రంలోని శనివారం చివరి రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే బతుకమ్మ నిమజ్జనానికి పండగ వైభవం గ్రామంలో సంతరించుకుంది. మహిళలంతా తీరొక్క పూలతో కనువిందు చేసేలా బతుకమ్మలను పేర్చి ఆ బతుకమ్మ పై అందమైన గౌరమ్మ ను ప్రతిష్టించి సంవత్సరం పాటు ఆయురారోగ్యాలతో మాకు సుఖ సంతోషాలను ఇవ్వాలని కోరారు. వేలాది సంఖ్యలో బతుకమ్మలను చేతిలో పట్టుకొని డప్పు చప్పులతో బజాబజంత్రిలతో ర్యాలీగా తరలి వస్తుంటే గ్రామమంతా ఒక్కసారి ఆ ర్యాలీని చూస్తూ తరిచిపోయారు. సెలయేరుకు చేరుకొని ఆ గౌరమ్మను గంగమ్మ ఒడిలో నిమర్జనం చేశారు. ఆ సెలయేరు మొత్తం పూల తోటగా మారి స్థానికులను కనువిందు పరిచింది. గంగమ్మ ఒడిలో గౌరమ్మ చేరగా.. రెండు కలయికలను ఒకేచోట చూడడం రెండు కళ్ళు సరిపోలేదు. నిమజ్జనం అనంతరం తలమడుగు బంగ్లాం వద్ద మహిళలు డీజే పాటలకు స్టెప్పులేశారు. అలాగే కోలాటాలు, సాంస్కృతిక నృత్యాలు చేస్తూ వైభవంగా బతుకమ్మ పండుగను ముగించారు.






