ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన తహశీల్దార్

by Batti.Sumithra |

సాత్నాల మండలం సైద్ పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(బాలుర)ను వసతి గృహాన్ని స్థానిక తహశీల్దార్ జాదవ్ రామారావు సందర్శించారు.

ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన తహశీల్దార్
X

దిశ, ఆదిలాబాద్ రూరల్(సాత్నాల) : ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం సాత్నాల మండలం సైద్ పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(బాలుర)ను వసతి గృహాన్ని స్థానిక తహశీల్దార్ జాదవ్ రామారావు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న వసతుల, భోజనం, గదులు తదితర వాటిని తనిఖీ చేశారు. కిచెన్ లో కలియతిరుగుతూ.. పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ పట్ల అశ్రద్ధ వహించవద్దని హెచ్చరించారు. విద్యార్థులతో మాట్లాడి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

Next Story