భార్యపై అనుమానంతో కత్తెరతో దాడి చేసిన భర్త..!

by Ratna Kumari |

దిశ‌, జ‌న్నారం : భార్య పై అనుమానంతో భర్త బీడీ కత్తెరతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన మండలంలోని చింతగూడ గ్రామంలో

భార్యపై అనుమానంతో కత్తెరతో దాడి చేసిన భర్త..!
X

దిశ‌, జ‌న్నారం : భార్య పై అనుమానంతో భర్త బీడీ కత్తెరతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన మండలంలోని చింతగూడ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన కోట అనిత కి జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపెళ్లి గ్రామానికి చెందిన సూర అశోక్‌ తో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు క‌ల‌డు. గత రెండు సంవత్సరాలు గా భార్య భర్తల గొడవలతో చింతగూడ గ్రామంలోనే ఉంటుంది. ఆమెపై కుమారుడికి 3 సంవ‌త్స‌రాలు. అనుమానంతో శనివారం రోజు చింతగూడ గ్రామానికి వచ్చి ఇంట్లో ఉన్న బీడీ కత్తెరతో భార్య మెడ భాగంలో తలపై పొడిచి తీవ్రంగా గాయపరిచి హాత్యా యత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం లక్షేటిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గొల్లపల్లి అనూష వెల్ల‌డించారు.

Next Story