ఆదివాసి యువ‌తిని మోసం చేసి హ‌త్య చేసిన నిందితుడిని క‌ఠినంగా శిక్షించాలి : CPM

by Ratna Kumari |

ఆదివాసీ యువతిని మోసం చేసి.. హత్య చేసిన నిందితుడిని కఠిన శిక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కూషన రాజన్న డిమాండ్ చేశారు. పెంచిక‌ల్ పేట్ మండలం కొండపల్లి గ్రామంలోని బాధిత కుటుంబాన్ని బుధవారం సీపీఎం జిల్లా నాయకులు ఆనంద్ కుమార్, అశోక్, శ్రీనివాస్ ప‌రామ‌ర్శించారు.

ఆదివాసి యువ‌తిని మోసం చేసి హ‌త్య చేసిన నిందితుడిని క‌ఠినంగా శిక్షించాలి : CPM
X

దిశ, ఆసిఫాబాద్ : ఆదివాసీ యువతిని మోసం చేసి.. హత్య చేసిన నిందితుడిని కఠిన శిక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కూషన రాజన్న డిమాండ్ చేశారు. పెంచిక‌ల్ పేట్ మండలం కొండపల్లి గ్రామంలోని బాధిత కుటుంబాన్ని బుధవారం సీపీఎం జిల్లా నాయకులు ఆనంద్ కుమార్, అశోక్, శ్రీనివాస్ ప‌రామ‌ర్శించారు. జిల్లాలో ఈ మధ్యకాలంలో ఆదివాసీ మహిళలపై దాడులు పెరిగాయని.. దీనికి ప్రధాన కారణం గతంలో నేరాలు చేసిన వారిని క‌ఠినంగా శిక్షించ‌క‌పోవ‌డ‌మే అన్నారు. జిల్లాలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం స్పందించి ఆదివాసీ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి.. ఏడు నెలల గర్భవతి అని చూడకుండా దారుణంగా హత్య చేసిన నిందితుడు జలపతిని కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారంతో పాటు 5 ఎకరాల భూమి ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరారు. కలెక్టర్, ఎస్పీ వెంట‌నే గ్రామాన్ని సందర్శించాలని వారు డిమాండ్ చేశారు.

Next Story