- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదిలాబాద్‌లో నిఘా నేత్రాలు.. 700 కెమెరాలతో 24 గంటల పర్యవేక్షణ
ఆదిలాబాద్ జిల్లాలో నేరాల నియంత్రణను మరింత బలోపేతం చేయడానికి పోలీసులు నిఘా వ్యవస్థను విస్తరించారు.

దిశ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో నేరాల నియంత్రణను మరింత బలోపేతం చేయడానికి పోలీసులు నిఘా వ్యవస్థను విస్తరించారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ పట్టణంలో 207 సీసీటీవీ కెమెరాలు, జిల్లా వ్యాప్తంగా మండలాలు, గ్రామాల్లో 283 కెమెరాలను ఏర్పాటు చేసి మొత్తం 490 నూతన కెమెరాలను రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రారంభించారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 700 సీసీటీవీ కెమెరాలతో 24 గంటల పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు.
నేరాల నియంత్రణలో సీసీటీవీల పాత్ర కీలకమని, ఒక కెమెరా 100 మంది పోలీసులకు సమానంగా పని చేస్తుందని పేర్కొన్నారు. ప్రజలు, వ్యాపార సంస్థలు తమ ప్రాంతాల్లో స్వచ్ఛందంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కెమెరాలు ఉన్న ప్రదేశాల్లో నేరాలు తగ్గే అవకాశం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు ఎస్పీలు, ఐపీఎస్ అధికారులు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






