- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎంఆర్ సరఫరా వేగవంతం చేయాలి : కలెక్టర్ రాజర్షి షా
దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఏంఆర్) సరఫరా ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజార్షి షా అధికారులు, రైస్ మిల్లర్లకు ఆదేశించారు. మంగళవారం

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఏంఆర్) సరఫరా ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజార్షి షా అధికారులు, రైస్ మిల్లర్లకు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో సీఎంఆర్ సరఫరా పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. సన్నబియ్యం మిల్లింగ్, సరఫరా పనులను నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేయాలని సూచించారు. సివిల్ సప్లై కమిషనర్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం.. మిల్లర్లు సీఎంఆర్ సరఫరా చేయకపోతే ఆర్ఆర్ చట్టం కింద చర్యలు తప్పవని హెచ్చరించారు. 2023–24 సీజన్‌కు సంబంధించిన మిగిలిన నాన్ అకౌంటెడ్ మిల్లర్ల వద్ద ఉన్న సన్న బియ్యాన్ని తక్షణం సరఫరా చేయాలని ఆదేశించారు. డిసెంబర్ చివరి నాటికి వంద శాతం సరఫరా పూర్తి చేయలన్నారు. ప్రతి వారం మిల్లర్లు తమ సరఫరా పురోగతిపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి నివేదికలు సమర్పించాలనీ ఆదేశించారు. బ్యాంకు రుణ సౌకర్యాల వినియోగంలో మిల్లర్లు తమ మిల్లింగ్ సామర్థ్యం, ఎఫ్సీఐ మార్గదర్శకాల మేరకే రుణాలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన అన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదనపు కలెక్టర్ శ్యామల దేవి,జిల్లా సివిల్ సప్లై అధికారి నందిని, డిఎం సుధారాణి, అధికారులు, పలు రైస్ మిల్లర్ల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.






