- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎక్సైజ్ అధికారుల ఆకస్మిక దాడులు.. ఐదు టన్నుల నల్ల బెల్లం సీజ్
మండల కేంద్రంలోని పలు దుకాణాల్లో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ కమిషనర్ నరసింహరెడ్డి ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ అబ్దుల్ రజాక్ ఆధ్వర్యంలో కడెం మండల కేంద్రంలో మంగళవారం పలు దుకాణాల్లో ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు.

దిశ, కడం: మండల కేంద్రంలోని పలు దుకాణాల్లో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ కమిషనర్ నరసింహరెడ్డి ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ అబ్దుల్ రజాక్ ఆధ్వర్యంలో కడెం మండల కేంద్రంలో మంగళవారం పలు దుకాణాల్లో ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ కిరాణా షాపు యజమాని షట్టర్‌లో గుడుంబా తయారీకి ఉపయోగించే ముడి సరుకు, నిషేధించిన 5 టన్నుల నల్ల బెల్లం, 3.5 క్వింటళ్ల పటికను సీజ్ చేశారు. కడెం మండలంలోని పాండాపూర్ గ్రామంలో నాటు సారా తయారీ చేస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అదుపులోకి తీసుకోవడం అసలు విషమం బయటపడిందని జిల్లా ఎక్సైజ్ అధికారి రజాక్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నాటుసారాపై నిషేధం ఉండటంతో ఎవరైనా సారా తయారు చేసిన, ముడి సరుకు నిర్వ ఉంచిన తమకు సమాచారం అందజేయాలని ప్రజలకు జిల్లా ఎక్సైజ్ అధికారి రజాక్ సూచించారు.






