నకిలీల దగా.. బ్రాండెడ్ ముసుగులో నాసిరకం సరుకులు

by Batti.Sumithra |

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ వస్తువుల అమ్మకాలు రవాణా అడ్డగోలుగా జరుగుతున్నది అడిగేవాడు లేక... వ్యాపారులు చెప్పింది వేదం అన్నట్లుగా వ్యాపారం సాగుతున్నది.

నకిలీల దగా.. బ్రాండెడ్ ముసుగులో నాసిరకం సరుకులు
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ వస్తువుల అమ్మకాలు రవాణా అడ్డగోలుగా జరుగుతున్నది అడిగేవాడు లేక... వ్యాపారులు చెప్పింది వేదం అన్నట్లుగా వ్యాపారం సాగుతున్నది. జీఎస్టీ, స్టేట్ టాక్స్ పక్కన పెడితే... దందా అంతా అక్రమమే అన్నట్లుగా సాగుతున్నది. ఈ విషయంలో అధికార యంత్రాంగం కూడా చేష్టలుడిగి చూస్తున్నది. ఉత్తర భారతదేశం నుంచి పెద్ద మొత్తంలో అక్రమంగా సరుకులు రవాణా జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అరికట్టే వారు లేకపోవడంతో వినియోగదారులు మోసపోవడం సహజంగా మారిపోతుండగా... వ్యాపారులు రెట్టింపు ప్రయోజనాలు పొందుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పరోక్షంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నప్పటికీ... నిలువరించే అధికారులు కఠినంగా లేకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడుతున్నది.

జోరుగా అక్రమాలు...

చూసేందుకు కరెంటు వైర్, ఫ్యాను, స్విచ్, బల్బ్... అన్ని ఒకేలా కనిపిస్తాయి. కంపెనీల బ్రాండ్లు కూడా స్పష్టంగా అవే ఉంటాయి. సానిటరీ వస్తువులకు సంబంధించి నల్లాలు, కమోడ్స్, పైపులు, స్టీల్ వస్తువులు అన్ని బ్రాండ్లలో ఒకే రకంగా కనిపిస్తాయి. కానీ వాటి లోపలి స్వభావం బయటకు కనిపించదు. దీంతో వినియోగదారులు ప్రత్యక్షంగా మోసపోతున్నారు. ఉత్తర భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎలక్ట్రికల్ సానిటరీ నకిలీ వస్తువుల రవాణా పెద్ద మొత్తంలో సాగుతున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. నాణ్యత విషయంలో దుకాణాల యజమానులు కొనుగోలు సమయంలో ఖచ్చితమైన హామీ ఇస్తున్నప్పటికీ... ఆ తర్వాత నకిలీ వస్తువులు అని తేలినప్పటికీ యజమానులు తాము ఏమీ చేయలేమని చేతులు ఎత్తేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని బైంస, బెల్లంపల్లి. లక్షెట్టిపేట ఇచ్చోడ, చెన్నూరు కాగజ్నగర్ తదితర పట్టణాల్లో పెద్ద మొత్తంలో ఎలక్ట్రికల్ సానిటరీ దుకాణాలు వెలిశాయి. దుకాణాల యజమానులు సైతం భారీ సంఖ్యలోనే ఉత్తర భారత నుంచి వచ్చి ఇక్కడ అమ్మకాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వినియోగదారులను బురిడీ కొట్టిస్తూ నకిలీ వస్తువులను అంట కడుతున్న ఆరోపణలు ఉన్నాయి.

టాక్స్ ల ఎగవేత...

నకిలీ వస్తువుల అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్న కారణంగా... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన పనులు ఎగ వేస్తున్నారు. ఉత్తర భారత నుంచి దిగుమతి చేస్తున్న ఈ వస్తువులకు సంబంధించి పూర్తిగా నకిలీ కావడంతో... జీఎస్టీ, స్టేట్ టాక్స్ ఉండే పరిస్థితులు లేవు. దీంతో వ్యాపారులు రెండు చేతుల సంపాదిస్తుండగా... ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతున్నది. ఈ పరిణామాలు వినియోగదారులకు ఆశనిపాతంగా మారుతున్నాయి.

Next Story