కాగజ్‌నగర్‌ బేకరీలలో నాణ్యతకు తూట్లు.. అధికారుల పర్యవేక్షణ ఎక్కడా..?

by Bhanu |

కాగజ్‌నగర్ పట్టణంలోని కొన్ని బేకరీల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, శుద్ధి లేని ఆహార పదార్థాలను విక్రయించడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

కాగజ్‌నగర్‌ బేకరీలలో నాణ్యతకు తూట్లు.. అధికారుల పర్యవేక్షణ ఎక్కడా..?
X

దిశ, కాగజ్నగర్ రూరల్ : కాగజ్‌నగర్ పట్టణంలోని కొన్ని బేకరీల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, శుద్ధి లేని ఆహార పదార్థాలను విక్రయించడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా తీసుకునే కేకులు, పఫ్‌లు వంటి పదార్థాల్లో బూజు పట్టిన ఘటనలు, దుర్వాసన రావడం వంటి ఫిర్యాదులు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. విజేత హాస్పిటల్ సమీపంలోని ఓ బేకరీలో కొనుగోలు చేసిన కేక్ బూజుపట్టిన దుర్వాసన వస్తుండటంతో, వినియోగదారుడు నిలదీయగా యజమాని నిర్లక్ష్యంగా “ఎవరికైనా చెప్పండి” అని సమాధానం ఇచ్చినట్టు సమాచారం.

అలాగే చికెన్ పఫ్, ఎగ్ పఫ్, కర్రీ పఫ్‌ల్లోనూ శుద్ధి లోపాలు ఉన్నాయని, నాణ్యతపై ప్రశ్నించిన వినియోగదారులను బెదిరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ఇటువంటి బేకరీలపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


Next Story