- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > విద్యార్థులు మంచి నీటిని సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే కోవ లక్ష్మి
విద్యార్థులు మంచి నీటిని సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే కోవ లక్ష్మి
by Batti.Sumithra |
విద్యార్థులు మంచి నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు.

X
దిశ, ఆసిఫాబాద్ : విద్యార్థులు మంచి నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఆసిఫాబాద్ పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి కేంద్రాన్ని డీఎఫ్ వో నీరజ్ కుమార్ టిబ్రేవాల్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు శుభ్రమైన తాగునీరు అందించడం ఎంతో అవసరమని చెప్పారు. జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం మంచి నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. అనంతరం డీఎఫ్ వో మాట్లాడుతూ సమాజ సేవలో భాగంగా అటవీ శాఖ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుకుల ప్రిన్సిపల్ స్వాతి, ఎఫ్ఆర్వో గోవింద్ చంద్ సర్దార్, తదితరులు ఉన్నారు.
Next Story






