- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎల్లూరు ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అస్వస్థత...
by Kodari Anjali |
ఎల్లూరు ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడితో పాటు, ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

X
దిశ, బెజ్జూర్: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం ఎల్లూరు ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు శుక్రవారం ఫుడ్ పాయిజన్ అయింది. ఎల్లూరు అశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న బయో సైన్స్ ఉపాధ్యాయుడు హట్కరి బాలాజీతో పాటు, ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయుడు బాలాజీ, పదవ తరగతి విద్యార్థులు శశికిరణ్, నవదీప్, సమ్మయ్య, అంజన్న, 9వ తరగతి చదువుతున్న సురేష్, కలిసి గురువారం రాత్రి మిగిలిన సాంబార్‌ను తిన్నారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయుడు అస్వస్థకు గురయ్యారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గమనించి పెంచికలపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శుక్రవారం ఉదయం తరలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు లేకపోవడంతో, కాగజ్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story






