పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు

by Ratna Kumari |

పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని జైనూర్ సీఐ రమేష్ హెచ్చరించారు.

పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు
X

దిశ, ఆసిఫాబాద్ : పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని జైనూర్ సీఐ రమేష్ హెచ్చరించారు. మహారాష్ట్ర, నాందేడ్ జిల్లా ఇస్లాపూర్ గ్రామానికి చెందిన‌ కిషన్ లాల్ జాట్, అజయ్ పాల్ జాట్, ఆశిష్ జైస్వాల్ ముగ్గురు ఎలాంటి అనుమతులు లేకుండా బావుల్లో రాళ్లు పేల్చేందుకు పేలుడు పదార్థాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. భారీ పేలుడు పదార్థాలతో పాటు వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. పేలుడు పదార్థాల అక్రమ వినియోగం, నిల్వ‌, ర‌వాణా వంటి చర్యలు అత్యంత ప్రమాదకర మైనవి అన్నారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు తీవ్రమైన ముప్పు కలిగిస్తాయని చెప్పారు. అనుమతులు లేకుండా పేలుడు అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని సీఐ హెచ్చరించారు.

Next Story