- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
by Naveena |
నకిలీ పత్తి విత్తనాలను అమ్మిన, కొనుగోలు చేసిన చర్యలు తప్పవని తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ అన్నారు.

X
దిశ, తాండూర్ : నకిలీ పత్తి విత్తనాలను అమ్మిన, కొనుగోలు చేసిన చర్యలు తప్పవని తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ అన్నారు. మండలంలోని చంద్రపల్లి గ్రామంలో గురువారం నకిలీ పత్తి విత్తనాలపై రైతులకు పోలీసులు అవగాహన సమావేశం నిర్వహించారు. నకిలీ విత్తనాలు వాడడం వల్ల భూమి యొక్క సారవంతం కోల్పోయి రానున్న రోజుల్లో పంట దిగుబడి తగ్గుతుందని, పర్యావరణంపై ప్రభావం పడుతుందన్నారు. నకిలీ విత్తనాలు అమ్మిన, కొనుగోలు చేసిన ఎవరికైనా తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారి వివరాలను గోప్యం ఉంచుతామని పేర్కొన్నారు.
Next Story






