పగలే వీధుల్లో వెలుగులు..!

by Batti.Sumithra |

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు డబ్బులు, వనరులు పొదుపుగా వినియోగించాలని చెబుతుండగా, మరోవైపు కొంతమంది నిర్లక్ష్యం వల్ల ప్రజల డబ్బు, ప్రకృతి వనరులు వృథా అవుతున్నాయి.

పగలే వీధుల్లో వెలుగులు..!
X

దిశ, కుబీర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు డబ్బులు, వనరులు పొదుపుగా వినియోగించాలని చెబుతుండగా, మరోవైపు కొంతమంది నిర్లక్ష్యం వల్ల ప్రజల డబ్బు, ప్రకృతి వనరులు వృథా అవుతున్నాయి. బాధ్యత కలిగిన ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కుబీర్ మండల కేంద్రంలోని ఒక కాలనీలో గురువారం మిట్ట మధ్యాహ్నం కూడా వీధి దీపాలు వెలుగుతుండటం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. “మన ఇంట్లో ఇలా ఉంటే వదిలేస్తామా?” అంటూ దారిన వెళ్తున్న వారు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు విద్యుత్ పొదుపు పై అవగాహన కల్పిస్తున్నప్పటికీ, ఇక్కడ మాత్రం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. పంచాయతీ అధికారులు ఇలాంటి ఘటనల పై వెంటనే స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story